వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటి కామెంట్స్ చేసినా వైరల్ అవుతుంటాయి. ఎలాంటి అంశల గురించి అయినా బెదురులేకుండా వర్మ తన అభిప్రాయాలు చెబుతాడు. విశాఖలో 'బ్యూటిఫుల్' చిత్ర మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్మ పాల్గొన్నాడు. 

వర్మ కనిపిస్తే మీడియా ఊరుకుంటుందా.. వెంటనే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశం గురించి వర్మని ప్రశ్నించారు. దీనికి వర్మ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 

రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి.. సామాన్య ప్రజలకు రాజకీయాలతో సంబంధం ఉండదు. వారు రాజధాని లాంటి అంశాన్ని పట్టించుకోరు. సామాన్యులకు రాజధాని ఎక్కడ ఉన్నా ఒక్కటే. రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి.. చెన్నైలో ఉంటే ఏంటి అని వర్మ ప్రశ్నించాడు. 

మతిపోగొట్టేలా బికినీలో హాట్ బ్యూటీ .. ఫొటోస్ వైరల్

రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిది. ప్రతి పట్టణం రాజధానిలా మారినప్పుడే ప్రజలకు నేరుగా పాలన అందుతుంది అని వర్మ అభిప్రాయ పడ్డాడు. ఇటీవల వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం వర్మ బ్యూటిఫుల్ చిత్రంతో ప్రేక్షకులని మరోమారు పలకరించేందుకు రెడీ అవుతున్నారు. అగస్త్య మంజు దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వర్మ పర్యవేక్షణలో రూపొందింది. మరోవైపు వర్మ తెరకెక్కించిన 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' మూవీ కూడా రెడీ అవుతోంది.