నాగబాబు మల్లెమాల సంస్థని వదిలేసినా.. అది మాత్రం నాగబాబుని వెంటాడుతూనే ఉంది. తమతో తెగతెంపులు చేసుకొని వెళ్తూ.. తమపైనే విమర్శలు చేసేసరికి మల్లెమాల యాజమాన్యం కూడా నాగబాబుని టార్గెట్ చేసింది. ఆయనతో పాటు ఆయన చేస్తోన్న షోలన్నీ ఆటోమేటిక్ గా టార్గెట్ అయ్యాయి.

'జబర్దస్త్' షో నుండి నాగబాబు బయటకి వెళ్లి 'జీ' తెలుగులో 'అదిరింది' అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. షో ఎలా ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు ఈ షోని ఈటీవీ టార్గెట్ చేస్తోంది. ఆదివారం నాడు రాత్రి 9:30గంటలకు 'అదిరింది' షో వచ్చే టైంలోనే ఈటీవీ 'జబర్దస్త్' ఎపిసోడ్ లను రీఎడిట్ చేసి ప్రసారం చేస్తున్నారు.

RRR ఎఫెక్ట్.. స్టార్ హీరోయిన్స్ కి ఎన్టీఆర్ బ్యూటీ హెచ్చరిక!

నాగబాబు హైలైట్ అయ్యే ఎపిసోడ్లను ఎంచుకొని మరీ వేస్తున్నారు. యాడ్స్ లేకుండా, స్కోర్స్ చెప్పకుండా.. ఎలాంటి ల్యాగ్ లేకుండా ఎడిట్ చేయడంతో ఈ షో జనాలను ఆకట్టుకుంటోంది. 'అదిరింది' స్కిట్స్ లో జబర్దస్త్ షోని టార్గెట్ చేయడం కూడా ఎక్కువైంది.

అగ్రిమెంట్ లేదని, పేమెంట్ తగ్గదంటూ టీం లీడర్స్ పరోక్షంగా జబర్దస్త్ షోపై పంచ్ లు వేస్తున్నారు. దీంతో మల్లెమాల యాజమాన్యం కూడా జబర్దస్త్ స్కిట్స్ లో నాగబాబుపై అలానే అదిరింది షోపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కంటే.. ఇలా ఒకరినొకరు దెప్పిపొడుచుకోవడానికే ఎక్కువ ఆసక్తి  చూపుతున్నట్లు అనిపిస్తోంది.

దీంతో రెండు ఛానెల్స్ మధ్య వార్ మొదలైంది. సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువ మంది జబర్దస్త్ షోనే సపోర్ట్ చేస్తున్నారు. 'అదిరింది' షో 'జబర్దస్త్'ని బీట్ చేయలేకపోతుందని.. పాత కాన్సెప్ట్ లు, కంటెంట్ తో బోర్ కొట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.