హాలీవుడ్ అనంతరం ఇండియన్ సినిమాలు కూడా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. భవిష్యత్తులో మన సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో అనువాదమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పవచ్చు. అందుకే పరదేశియులు కూడా ఇండియన్ స్క్రీన్ పై కనిపించడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్ పై కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. RRR సినిమాలో ముగ్గురు విదేశీ నటులు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారికి ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో దక్కుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన లోకల్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ తో నటిస్తున్న ఒలీవియాకు బ్రహ్మరధం పడుతున్నారు. హీరోయిన్ ఒలీవియా ట్విట్టర్ ఫాలోవర్స్ అయితే ఒక్కసారిగా పెరిగిపోయారు.

థియేటర్ ఆర్టిస్ట్ గాఉన్న ఒలీవియా మోరిస్ RRRలో నటిస్తోంది అనగానే ట్విట్టర్ ఫాలోవర్స్ 400 నుంచి 17,000కు పెరిగిపోయారు. ఇక రీసెంట్ గా 2020 హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన అమ్మడు మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంది. RRR సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఇంట్రెస్టింగ్ గా ఉందని ట్వీట్ చేయగా నిషాల్లోనే వేల లైకులు వచ్చాయి. ఇకపోతే అమ్మడు ఒక విధంగా ఇక్కడి స్టార్ హీరోయిన్స్ కి హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్స్ కొరత ఏర్పడ్డ సమయంలో అమ్మడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో కొంత పోటీ ఇవ్వగలదని తెలుస్తోంది. గతంలో అమీ జాక్సాన్ కూడా హాలీవుడ్ కంటే ఇండియన్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపి మంచి ఆఫర్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఒలీవియా కూడా RRR సినిమాతో హిట్టందుకుంటే ఇండియన్ హీరోయిన్స్ అవకాశాలకు ఎంతో కొంత ఎఫెక్ట్ పడక తప్పదు.