కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి జనజీవితాలని స్తంభింపజేసింది. ఇండియాలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో సెలెబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 

సెలెబ్రిటీలు ఇళ్లలో ఉంటూనే మీడియాతో ముచ్చటిస్తున్నారు. తాజాగా నటి రేణు దేశాయ్ తన నివాసం నుంచే పలు మీడియా సంస్థలతో ఇంటర్వ్యూలలో పాల్గొంది. ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ కు యాంకర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలు మహేష్, ప్రభాస్ లాంటి వారికి తల్లిగా నటించే పాత్రలు వస్తే చేస్తారా అని ప్రశ్నించింది. 

దీనికి రేణు దేశాయ్ బదులిస్తూ వాళ్ళ చైల్డ్ హుడ్ మదర్ గా నటిస్తా అని సరదాగా సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నన్ను ఓల్డ్ లుక్ లో బాగా చూపించగలం అనే నమ్మకం దర్శకులకు ఉంటే.. మహేష్ లాంటి హీరోలకు తల్లిగా నటించేందుకు నేను రెడీ. 

ఇద్దరు దిగ్గజాల మరణం.. 'క్రిష్', 'డర్టీ పిక్చర్' నటుడిపై తాజాగా రూమర్స్

మేమంతా నటులం. ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు రెడీగా ఉండాలి అని రేణు దేశాయ్ తెలిపారు. ఇప్పుడు అంతా నన్ను అమ్మా అమ్మా ని పిలుస్తున్నారు అని.. బహుశా తాను తల్లి పాత్రలకు బాగా సూట్ అవుతానేమోనని రేణు దేశాయ్ సరదాగా కామెంట్స్ చేశారు.