టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసి అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటినుండి సినిమాపై ఆసక్తి చూపలేదు. కానీ ఆమెకి డైరెక్షన్ సైడ్ ఉండడం ఇష్టం. అందుకే పవన్ నుండి విడిపోయిన తరువాత కూడా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు.

మరాఠీలో దర్శకురాలిగా ఒక సినిమా, అలానే  నిర్మాతగా మరో రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగులో రైతుల బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనికోసం రీసెర్చ్ వర్క్ కూడా చేసింది.

Breaking: నటి రాశి ఇంటిపై ఐటీ దాడులు..!

ఓ వైపు వృత్తిపరంగా బిజీగా ఉంటూనే.. తన పిల్లలతో కలిసి ఆనందమైన జీవితాన్ని గడుపుతోంది. ప్రస్తుతం రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆధ్య తమ తండ్రి పవన్ కళ్యాణ్ 
వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి పండగ సందర్భంగా అకీరా, ఆధ్య హైదరాబాద్ కి వెళ్లి తమ తండ్రితో కలిసి పండగ జరుపుకున్నారు.

ఇది ఇలా ఉండగా.. రేణుదేశాయ్ వెకేషన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్లింది. ఒంటరిగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి ట్రిప్స్ కి వెళ్లే రేణు ఈసారి మాత్రం ఒంటరిగా వెకేషన్ కి వెళ్లింది.

మాల్దీవ్స్ లో తీసుకున్న రెండు అందమైన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సముద్రంలో ఒంటరిగా స్విమ్ చేయడం చేయడం ఎంతో బాగుందని చెప్పుకొచ్చింది.