ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ కాంపిటిషన్ ఉంటుంది. ఈసారి కూడా హీరోలు హడావిడి చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి సంక్రాంతి ఫైట్ మామూలుగా ఉండేటట్లు లేదు. దానికి కారణం ఏంటంటే.. మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి.

అంతేకాదు.. ఈ ఇద్దరు హీరోలు జనవరి 12వ తేదీనా రావాలని ఫిక్స్ అయి కూర్చున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. ఇద్దరు హీరోలు ఒకేరోజు సినిమా రిలీజ్ పెట్టుకుంటే అభిమానులకు అది బాగానే ఉంటుంది కానీ ఆర్థికంగా రెండు సినిమాలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.

ఒకప్పుడు ఎవరూ గుర్తుపట్టని తారలు.. ఇప్పుడు ఫుల్ బిజీ!

ఓపెనింగ్స్ రెండు సినిమాలు పంచుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఒక సినిమా ముందుకు, మరో సినిమా వెనక్కి వెళ్తుందనే ప్రచారం జరిగింది. ఒక్క రోజులో గ్యాప్ లో సినిమా రిలీజ్ చేస్తే.. వసూళ్లపై పెద్దగా ప్రభావం ఉందని అనుకున్నారు. కానీ సినిమా విడుదల తేదీ మార్పు విషయంలో మహేష్ బాబు ఒప్పుకోవడం లేదని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తమ చిత్రాన్ని జనవరి 12నే విడుదల చేయాలని అనుకుంటున్నారట మహేష్. పోనీ బన్నీ ఏమైనా రాజీ పడతాడా అనుకుంటే.. తను కూడా ఈ విషయంలో పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గకపోతే గనుక బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. మరో రెండు నెలల సమయం ఉంది కాబట్టి రిలీజ్ డేట్స్  విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి!