చిరంజీవి హీరోగా...స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన ‘సైరా’ అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం అందుకుంది. అంతేకాదు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం.... బాక్సాఫీసు వద్ద రెండు రోజుల్లో రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

‘సైరా’ చిరు 12 ఏళ్ల కల కావడం విశేషం. ఇన్నేళ్ల తర్వాత ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించి.. తండ్రి కలను సాకారం చేశారు. సురేందర్‌ రెడ్డి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. ఆ ఉత్సాహంలో ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రానికి సిద్దపడుతున్నారు.

చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు.. చరిత్రలో చూడని డెడ్లీ కాంబినేషన్స్!

మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కమిటయ్యిన సంగతి తెలిసిందే.   మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. డిసెంబర్ మొదట వారం నుంచి ప్రారంభం కాబోతోందని చెప్పబడుతున్న ఈ సినిమాని వేసవి రిలీజ్ అనుకున్నారు. కానీ అంత స్పీడుగా పూర్తి, చేసి రిలీజ్ చేయటం కష్టమని నిర్ధారించుకుని ఆగస్టు 14న ఈ సినిమాని రిలీజ్ చేయటానికి డిసైడ్ చేసారట.

 స్వతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనకు చిరంజీవి సైతం ఓటేసారట. అయితే ఈ లోగా తన కుమారుడు రామ్ చరణ్ నటించిన 'ఆర్.ఆర్.ఆర్ '  వస్తుందనే ఆలోచన ఉంది. జూలై 30,2020 అన్నారు కానీ ఆ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాసం ఉందని తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.