కెరీర్ ఆరంభంలో రెజీనా కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ పరంగా కూడా రెజీనా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతని ఆకర్షించే విధంగా రెజీనా పలు చిత్రాల్లో అందాలు ఆరబోసింది. ఇటీవల రెజీనా విభిన్నమైన చిత్రాలకే మొగ్గు చూపుతోంది. గత ఏడాది రెజీనా నటించిన ఎవరు చిత్రం మంచి సక్సెస్ సాధించింది. 

ప్రస్తుతం రెజీనా నేనే నా ? అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా రెజీనా లుక్ ని లాంచ్ చేశాడు. ఈ లుక్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

ఈ లుక్ లో రెజీనా మహారాణి గెటప్ లో కనిపిస్తోంది. కానీ ఆమెని ఇనుప చువ్వల మధ్య బంధించి ఉన్నారు. శరీరంపై గాయాలు, ముఖంపై గాట్లతో రెజీనా తీవ్ర వేదనలో ఉన్నట్లు ఉన్న లుక్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రం ఏ జోనర్ లో తెరకెక్కుతోంది అనేది రివీల్ చేయలేదు కానీ.. ఈ చిత్రం ద్వారా రెజీనాకు మరో అద్భుతమైన పాత్ర దక్కినట్లే అని భావించవచ్చు. 

43 ఏళ్ల పవన్ హీరోయిన్ సెక్సీ ఫోజులు.. ఈమె ఎవరో గుర్తుపట్టారా!

ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై రాజ్ శేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవిలో రిలీజ్ కు సన్నాహకాలు జరుగుతున్నాయి.