మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఆచార్యపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాల తరహాలోనే సందేశాత్మక అంశాలతో కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఈ చిత్ర కథపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ దేవాదాయ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాటం చేసే వ్యక్తిగా చిరంజీవి పాత్ర ఉండబోతోంది. ఇక ఈ చిత్రంలో 40 నిమిషాల కీలక పాత్ర కోసం మహేష్ బాబు, రాంచరణ్ లాంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. 

కొరటాల శివ చిత్రం అంటే సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయి. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ స్పెషల్ సాంగ్ లో రెజీనా మెగాస్టార్ సరసన ఆడి పాడింది. చిరంజీవి చిత్రంలో ఐటెం సాంగ్ చేయడంపై రెజీనా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. 

పవన్ నటుడు కాదు.. అలాంటి సినిమాలు వద్దు!

తాను భవిష్యత్తులో ఇక స్పెషల్ సాంగ్స్ చేయనని తేల్చి చెప్పింది. కేవలం చిరంజీవి సర్ కోసమే ఈ చిత్రంస్పెషల్ సాంగ్ చేశా. ఇకపై చేయను. మెగాస్టార్ తో డాన్స్ చేయడం అంత సులువు కాదు. కానీ చిరంజీవి గారు నా డాన్స్ ని మెచ్చుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. సెట్స్ లో చిరంజీవి గారి సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయా. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానాన్ని ఎప్పటికి మరచిపోను అని రెజీనా పేర్కొంది. 

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో ఆరు రోజులపాటు స్పెషల్ సాంగ్ షూటింగ్ జరిగినట్లు రెజీనా పేర్కొంది. రెజీనా ప్రస్తుతం నేనేనా అనే ఆసక్తికర చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదలై మెప్పించింది.