జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. పవన్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రంతో పాటు పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో కూడా నటిస్తున్నాడు. 

క్రిష్ మూవీ తర్వాత పవన్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. దీనితో ఈ రెండు చిత్రాలపై ఇప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఓ అభిమాని ట్వీట్ కు హరీష్ శంకర్ స్పందించాడు. 

సదరు అభిమాని హరీష్ శంకర్, దర్శకుడు క్రిష్ లకు ఓ రిక్వస్ట్ చేశాడు. హరీష్ శంకర్, క్రిష్ సర్ మీ ఇద్దరి నుంచి మేము ఒక మోటివేషనల్ మూవీ కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నటుడు కాదు.. నాయకుడు. కాబట్టి పవన్ తో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయవద్దు అని రిక్వస్ట్ చేశాడు. 

పంజాబీ పిల్లతో రామ్ చరణ్ లవ్ ఎఫైర్ ?

అభిమాని ట్వీట్ ని లైక్ చేసిన హరీష్ శంకర్ పరోక్షంగా తన సమ్మతిని తెలియజేశాడు. గబ్బర్ సింగ్ చిత్ర రిలీజైనప్పుడు.. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పవన్ ఒక రాజకీయ పార్టీకి అధినేత కూడా. ఈ అంశాలన్నింటికీ హరీష్ శంకర్ దృష్టిలో పెట్టుకునే కథ సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇక క్రిష్ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూడా పూర్తి స్థాయిలో ఎంటర్టైనర్ కాదు. పవన్ బందిపోటుగా దోపిడీలు చేసి పేదవారిని ఆదుకునే పాత్రలో నటిస్తున్నాడు. దీనితో పవన్ కి ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ఆధారంగా అయన నటించే చిత్రాలు ఉండబోతున్నాయి.