సాధారణంగా ఇండస్ట్రీలో పెద్దవాళ్ల పెగ్గు స్టోరీ లు వింటూంటాం. కానీ బాలయ్య విషయంలో మాత్రం విగ్గు స్టోరీ వినాల్సి వస్తోంది. ఆయన ధరించే విగ్గు ప్రతీసారి ట్రోలింగ్ కు గురి అవుతోంది. సింహా, లెజండ్ వంటి సినిమాల విషయంలో తప్ప ప్రతీ సారి ఆయన విగ్గులు విమర్శల పాలవుతున్నాయి. రీసెంట్ గా రూలర్ సినిమా కోసం ఆయన ధరించిన విగ్గు చాలా దారుణంగా ఉందని ఫ్యాన్సే వాపోయే పరిస్దితి.అయితే ఈ విషయాలు ఏమీ బాలయ్యకు తెలియటం లేదో ఏమీ కానీ ఆయనలో మార్పు మాత్రం రావటం లేదు. అందుకు కారణం ఏమిటి అనేది చర్చగా మారింది.

'మత్తు వదలరా' ప్రీమియర్ షో టాక్.. కీరవాణి తనయుల చిత్రం ఎలా ఉందంటే!

మీడియాలో ప్రచారం అవుతున్న కథనం ప్రకారం..బాలయ్యకు సరైన మేకప్ ఆర్టిస్ట్ లు సెట్ అవటం లేదని టాక్. ఆయన ముక్కోపి అనే భయంతో మేకప్ ఆర్టిస్ట్ లు ఎవరూ ఆయనతో పనిచేయటానికి ధైర్యం చాలటం లేదు. బాలయ్యతో కంటిన్యూగా పనిచేసిన వారు మానేయటంతో  ఈ విగ్గు సమస్య వచ్చి పడింది. కథని, క్యారక్టర్ ని బట్టి ఆహార్యం మార్చాలని నమ్మే నటుడు బాలయ్య కావటంతో ప్రతీ సారి విగ్గులు మారుస్తున్నారు.

ఆయన తండ్రి నందమూరి తారకరామారావు ఆయన నట జీవితాంతం పీతాంబరం అనే మేకప్ ఆర్టిస్ట్ తోనే నడిపారు. పీతాంబరాన్ని ప్రొడ్యూసర్ గా కూడా నిలబెట్టారు. వారి అబ్బాయి..తమిళ ప్రముఖ దర్శకుడు పి.వాసు(చంద్రముఖి ఫేమ్). అయితే బాలయ్య దగ్గరకు వచ్చేసరికి అది జరగటం లేదు.

ఇక బాలయ్యకు ఫలానా విగ్ సెట్ కాలేదని ధైర్యంగా చెప్పేవారు లేకపోవటం కూడా ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా బాలయ్య తన తదుపరి చిత్రం విషయంలో విగ్గు గురించి ఇక ట్రోల్స్ కు గురి అవ్వదలచుకోలేదు. ఆయన కుటుంబ సభ్యులు బాలయ్యకు ..విగ్గు ఎంత వింతగా నవ్వులు పాలు చేస్తోందో చెప్పారట. దాంతో ఈ సారి ఆ సమస్య రాకుండా ఉండటం కోసం లండన్ కు వెళ్తున్నట్లు చెప్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో బోయపాటి సినిమా కోసం  ఆయన ప్రిపేరు అవుతున్నారు.