సాధారణంగా ఓ హిట్ ఇచ్చిన దర్శకుడుతో సినిమా చేస్తే అంచనాలు పెరుగుతాయిని హీరోలు భావిస్తూంటారు. అలాంటి కాంబినేషన్ ని సెట్ చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తూంటారు. అంతేకానీ ఎవరూ ఏరి కోరి తనకు డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడుతో సినిమా చేయటానికి ఉత్సాహం చూపించరు. కానీ రవితేజ తీరే వేరు. తను అవతలివారిలో టాలెంట్ ఉందని నమ్మితే సినిమా ఇవ్వటానికి కొంచెం కూడా వెనకాడరు. జయాపజయాలు అసలు పట్టించుకోరు. తనకీ ప్లాఫ్ లు వచ్చాయని, అయినా తర్వాత హిట్ లు ఇచ్చానని, అదే విధంగా ఎవరైనా ఫ్లాఫ్ కొట్టిన వారు మళ్లీ ఫామ్ లోకి వస్తారంటారు. గతంలో తనకు షాక్ వంటి ప్లాఫ్ ఇచ్చిన హరీష్ శంకర్ తో మళ్లీ మిరపకాయ వంటి సినిమా తీసి హిట్ కొట్టారు. ఇప్పుడు అదే విధంగా దర్శకుడు రమేష్ వర్మతో సినిమా చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే...రవితేజ హీరోగా ఏ స్టూడియోస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. రమేష్‌ వర్మ దర్శకుడు. గతంలో వీరిద్దరి కలయికలో ‘వీర’ వచ్చింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు రెండోసారి కలిసి పనిచేయబోతున్నారు. హవీష్‌ నిర్మాతగా ఈ రూపొందే ఈ చిత్రం వివరాలను నిర్మాత అఫీషియల్ గా ప్రకటించారు.  

చిరు కుమార్తె ప్రేమ వివాహంలో ఆయన కుట్ర.. పోసాని ఘాటు వ్యాఖ్యలు!

చిత్ర సమర్పకుడు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘రాక్షసుడు’ తరవాత రమేష్‌వర్మ చేయబోతున్న చిత్రమిది. కథ, కథనాలు రవితేజ స్టైల్ కు  తగ్గట్టుగా ఉంటాయి. వచ్చే నెలలో లాంఛనంగా షూటింగ్ మొదలెడతాం. మార్చి నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్తాం. ఇతర నటీనటులు,టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడిస్తాము’’అన్నారు.

ఎక్కడి నుంచో వచ్చారు.. పవన్, బాలయ్య, మహేష్ కొంప ముంచిపోయారు!

ఇక రవితేజ రీసెంట్ గా  `డిస్కోరాజా`గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. సినిమా యావరేజ్, ప్లాఫ్ అంటూ  భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా ఆ సినిమాకి మంచి ఓపెనింగ్సే వ‌చ్చాయి. అలాగే తన తదుపరి చిత్రంగా  `క్రాక్‌` టైటిల్ తో  ఇప్ప‌టికే ప‌ట్టాలెక్కించాడు. తాజాగా రమేష్ వర్మ సినిమాకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు.