రవితేజ స్పీడు పెంచాడు. డిస్కోరాజా ఓ వైపు షూటింగ్ జరుగుతూండగానే, మ‌రోవైపు గోపీచంద్ మ‌లినేని సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు ర‌వితేజ‌.  ఈ రోజు ఈ సినిమా ఎనౌన్స్ చేసారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ మరోసారి పోలీస్ గా కనిపించి అలరించనున్నారు. ఈ చిత్రానికి `క్రాక్‌` అనే  టైటిల్  పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

రవితేజ 66వ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

ర‌వితేజ‌కు పోలీస్ క‌థ‌లు బాగానే  కలిసొచ్చాయి. గతంలో పోలీస్ గా క‌నిపించిన‌ విక్ర‌మార్కుడు ర‌వితేజ కెరీర్‌లో పెద్ద హిట్టు.  'ప‌వ‌ర్‌' కూడా ర‌వితేజ ప‌వ‌ర్‌ని చూపించింది. దాంతో అదే ఉత్సహంతో ఇప్పుడు మ‌రోసారి ఖాకీ యూనిఫామ్ వేయ‌బోతున్నాడు ర‌వితేజ‌.   శ్రుతిహాస‌న్ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తోంది. ఇంతకు ముందు ఈ ముగ్గురి కాంబినేష‌న్‌లో బ‌లుపు వ‌చ్చింది.ప‌వ‌ర్ కూడా బాగానే ఆడింది. రి ర‌వితేజ‌కు అచ్చొచ్చిన గెటప్ తో కూడిన క‌థ‌తో.. త‌ను మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడని అబిమానులు అంచనా వేస్తున్నారు.

రవితేజ  ప్రస్తుతం 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో తెరకేక్కిస్తున్నారు. కాలాన్ని వెనక్కి పంపడం అనే ఓ విభిన్న కధాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.