మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుంది. 'డాన్ శీను', 'బ‌లుపు' వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ర‌వితేజ 66వ చిత్ర‌మిది.

ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఈ సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. వీరిద్ద‌రి హ్యాట్రిక్ సినిమా కావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

(Also Read) కళ్యాణ్ దేవ్.. 'సూపర్ మచ్చి' ఫస్ట్ లుక్!


ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభిస్తామ‌ని, అలాగే సినిమాకు సంబంధించిన మిగిలిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియజేసింది. ప్రస్తుతం రవితేజ 'డిస్కో రాజా' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. డిసంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజైన తరువాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా మొదలుకానుంది.