ఒకప్పుడు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన రవీనా టాండన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బాలీవుడ్ కి పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ నిర్మాత ఫర్హాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ కామెడీలో కమెడియన్ భారతి సింగ్ తో కలిసి పాల్గొన్నారు.

క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ షోలో రవీనా టాండన్ క్రైస్తవ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించిందని క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ బుధవారం అజ్నాలా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీవీ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్!

క్రైస్తవ మతానికి సంబంధించిన ఓ పదం గురించి రవీనా, భారతి సింగ్, ఫర్హాన్ ఖాన్ లు సరదాగా స్పందించారు. ఈ విషయం తమ మతాన్ని అవమానించేలా ఉందని వారిపై పంజాబ్ లో పోలీస్ కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న రవీనా ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఏ ఒక్క మతాన్ని కించపరిచే విధంగా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పింది. ఎవరినీ అవమానించడం తన ఉద్దేశం కాదని చెప్పింది. ముగ్గురం ఎవరినీ ఉద్దేశించి చర్చించుకాలేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా తన కారణంగా బాధపడితే మాత్రం క్షమించాలని కోరారు.