బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఓ టీవీ షోలో తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలలోకి వెళితే.. ఇటీవల దీపికా 'డాన్స్ ప్లస్' అనే రియాలిటీ షోలో పాల్గొంది.

ఈ షోలో పాల్గొన్న కంటెస్టంట్స్ అందరూ కలిసి తమ డాన్స్ తో దీపికాకి నీరాజనం పలికారు. బాలీవుడ్ లో దీపికా జర్నీని ఆమె సినిమాల్లో పాటలతో డాన్స్ రూపంలో స్టేజ్ పై ప్రదర్శించారు.

ఫైనల్ గా పద్మావత్ సినిమాలో గూమర్ సాంగ్ తో ఈ డాన్స్ షో ముగిసింది. స్టేజ్ పై కంటెస్టంట్స్ అందరూ డాన్స్ చేస్తున్నంతసేపు ఎంతో ఆసక్తిగా చూస్తూ కూర్చుంది దీపికా. ఆఖరి పాటకి వచ్చేసరికి ఆమె తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. తన రెండు చేతులు ముఖానికి అడ్డుపెట్టుకొని ఏడ్చేసింది.

ముదురు భామలతో కుర్ర హీరోల ఘాటు రొమాన్స్!

తన పక్కనే ఉన్న జడ్జి రెమో డిసౌజా ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దీపికా ఏడుస్తూనే ఉంది. అక్కడే ఉన్న ఆడియన్స్ అంటూ ఆమెని కూల్ చేయడానికి 'దీపికా దీపికా' అంటూ అరవడం మొదలుపెట్టారు.

దీంతో ఆమె తేరుకొని ఎమోషనల్ గా మాట్లాడింది. ఇప్పటివరకు ఎన్నో షోలలో పాల్గొన్నట్లు చెప్పిన ఆమె ఇలాంటి ఇంత భావోద్వేగానికి గురి కాలేదని.. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని తెలిపింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దీపికా 'ఛపాక్' సినిమా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.