రక్షిత్ శెట్టి అనగానే మన తెలుగు వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ హీరోయిన్ రష్మిక మాజీ లవర్ అంటే మాత్రం వెంటనే గుర్తొస్తారు. గత ఏడాదిలో రక్షిత్ శెట్టి పేరు తెలుగు వాళ్ల నోళ్లలో బాగా వినిపించింది. రక్షిత్ హీరోగా నటించిన 'కిరిక్ పార్టీ' సినిమాతోనే రష్మిక హీరోయిన్ గా పరిచయమైంది.

అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ అది ఎంగేజ్మెంట్ వరకు వెళ్లింది. కానీ పెళ్లి మాత్రం వాయిదా వేసుకున్నారు. రెండేళ్ల పాటు సవ్యంగానే సాగిన వీరి ప్రేమకి కొన్ని నెలల క్రితం బ్రేకులు పడ్డాయి. దీనికి కారణం ఏంటో తెలియనప్పటికీ రష్మిక మాత్రం రక్షిత్ నుండి విడిపోయింది. 

ఈ 20ఏళ్లలో అత్యధిక లాభాల్ని అందించిన సినిమాలు (2000 - 2019)

రష్మిక లవర్ గా తెలుగులో బాగానే పాపులర్ అయ్యాడు రక్షిత్. ఆ పాపులారిటీని నమ్ముకునే ఇప్పుడు ఓ బహుభాషా చిత్రంలో నటించినట్లున్నాడు రక్షిత్ శెట్టి. 'అతడే శ్రీమన్నారాయణ' అనే సినిమాలో రక్షిత్ శెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సచిన్ అనే దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

నిజానికి రక్షిత్ శెట్టికి ఇతర భాషల్లో అంత క్రేజ్ లేదు. కనీసం అతడి పేరు కూడా పెద్దగా తెలియదు. అలాంటిది అతడు హీరోగా నటించిన సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయడమంటే విడ్డూరమే.. సుదీప్ లాంటి పేరున్న హీరోల సినిమాలానే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాంటిది రక్షిత్ శెట్టి సినిమా అంటే జనాలు ఆదరిస్తారా అనేది సందేహమే.. ఈ సినిమాను డిసెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.