ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి రష్మిక మందన మెరుపులా వచ్చింది. తొలి చిత్రంతోనే రష్మికకు యువత ఫిదా అయిపోయారు. రష్మిక చిలిపితనం, క్యూట్ నెస్ యువతకు బాగా నచ్చేసింది. అందుకు తగ్గట్లుగానే ఛలో, గీత గోవిందం లాంటి వరుస విజయాలు దక్కడంతో రష్మికకు టాలీవుడ్ డిమాండ్ పెరిగిపోయింది. 

ఇటీవల రష్మిక సరిలేరు నీ కెవ్వరు, భీష్మ చిత్రాలతో సక్సెస్ అందుకుంది. దీనితో బాక్సాఫీస్ వద్ద రష్మిక జైత్ర యాత్ర కొనసాగుతున్నట్లు అవుతోంది. రైజింగ్ లో ఉన్న హీరోయిన్ పై రూమర్స్ సహజమే.. అదే సమయంలో రష్మిక వ్యక్తిగత వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలిచింది. 

కలియుగంలో కనిపించే సీత.. చెల్లెళ్ళతో ఫోటో, ఇంటర్నెట్ లో వైరల్!

తనపై వస్తున్న రూమర్స్ ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించగా రష్మిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మనిషి అన్నాక వ్యక్తిగత సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. సెలెబ్రిటీఆ అయితే అవి వార్తలుగా మారుతాయి. వాటిని బేస్ చేసుకుని అనేక పుకార్లు పుట్టుకొస్తాయి. అలాంటి పుకార్లని అసలు పట్టించుకోను. ఎందుకంటే నాకు అంతా తీరిక లేదు.  

నా షూటింగ్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడం, డేట్స్ అడ్జెస్ట్ చేయడం వీటితోనే సమయం గడిచిపోతోంది.. కొన్ని సార్లు తినడం కూడా మరచిపోతున్నా.. కాబట్టి గాలి వార్తలని పట్టించుకునే తీరిక నాకు లేదు. కెరీర్ ఆరంభంలో నాపై వస్తున్న రూమర్స్ చూసి కొంత బాధపడేదాన్ని.. ఇప్పుడు అలవాటైపోయింది అని రష్మిక చెప్పుకొచ్చింది.