80వ దశకంలో బుల్లితెరపై ప్రసారం అయిన రామాయణం టివి సిరీస్ ఒక చరిత్రాత్మకం. ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం రామాయణం. 80 వ దశకంలో ఈ టివి సిరీస్ దూరదర్శన్ లో ప్రసారం అయింది. 

ఈ టివి సిరీస్ లో ప్రతి పాత్ర అద్భుతమే. ఐఎండిబిలో ఈ టివి సిరీస్ కి 9.3 రేటింగ్ కనిపిస్తుంది. అంతలా ఈ టివి సిరీస్ ఖ్యాతి దక్కించుకుంది. ఈ టివి సిరీస్ లో ప్రముఖ నటి దీపికా చిక్లియా సీత పాత్రలో నటించారు. కలియుగంలో కనిపించే సీత ఈమే అంటూ అభిమానులు ప్రశంసించే స్థాయిలో ఆమె ఈ పాత్ర ద్వారా గుర్తింపు పొందారు. 

రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

లాక్ డౌన్ కారణంగా తిరిగి రామాయణం టివి సిరీస్ ని ప్రసారం చేస్తున్నారు. ఈ సంధర్భంగా రామాయణం టీం అప్పటి అనుభవాలని నెమరు వేసుకుంటున్నారు. దీపికా తాజాగా తన సోషల్ మీడియాలో ఓ మెమొరబుల్ పిక్ ని అభిమానులతో పంచుకున్నారు. సీతా దేవి పాత్రలో ఉన్న దీపికా తన ఆన్ స్క్రీన్ చెల్లెళ్ళతో వెళిపోతున్న ఫోటోని పంచుకున్నారు. 

ఈ పిక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సితాజి విత్ హర్ సిస్టర్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించింది. ఆ మధ్యన దీపికా కపిల్ శర్మ షోకి హాజరైనప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా సెలెబ్రిటీలు కనిపించగానే అభిమానులు హాయ్, హలో సర్, మేడం అని పలకరిస్తారు. కానీ నేను కనిపించగానే రెండుచేతులు జోడించి నమస్కరిస్తారు అని  దీపికా తెలిపారు.