కన్నడ బ్యూటీ రష్మిక టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా ఈ బ్యూటీకి బాలీవుడ్ 'జెర్సీ' రీమేక్ లో  నటించే ఆఫర్ కూడా వచ్చింది. కానీ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది ఈ బ్యూటీ. దానికి కారణం రెమ్యునరేషన్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

దీనిపై రష్మిక ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. 'జెర్సీ' సినిమా హిందీ రీమేక్ లో హీరోయిన్ గా ముందుగా తనకే ఛాన్స్ వచ్చిందని.. కానీ ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసినట్లు కన్ఫర్మ్ చేసింది. దానికి కారణం డబ్బులు కాదని అంటోంది.

తను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా, దాన్ని ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడంతో తను ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రష్మిక ఖండించింది. తను భారీ రెమ్యునరేషన్ అడిగిన మాట నిజం కాదని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకి న్యాయం చేయలేకపోతాననే భయంతో తప్పుకున్నట్లు రష్మిక చెబుతోంది.

క్యాన్సర్ తో హీరో సోదరి మృతి!

ఆ సినిమా ఒక భారీ ప్రాజెక్ట్ అని, అంత భారమైన పాత్రలో తను నటించలేనని రష్మిక అంటోంది. హీరోయిన్ అయి ఉండి రష్మిక ఇలాంటి కారణం చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం పెళ్లైన పాత్రలో నటించడానికి ఆమె వెనుకడుగు వేసి ఉంటుందని అంటున్నారు.

ఏదేమైనా.. రష్మిక ఓ బాలీవుడ్ ఆఫర్ వదులుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాలో నటిస్తోంది. అలానే అల్లు అర్జున్ తదుపరి సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయింది. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది.