ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తక్కువ సాయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. గ్లామర్ పరంగా కూడా రష్మిక యువతని ఆకట్టుకుంటోంది. దీనితో రష్మిక కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. 

రష్మిక బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం జెర్సీ రీమేక్ లో నటించబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. హిందీ రీమేక్ కు కూడా గౌతమ్ తిన్ననూరే దర్శకుడు. 

ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ మొదట రష్మికని సంప్రదించారు. కానీ రష్మిక ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసింది. రష్మిక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని, అందుకు నిర్మాతలు అంగీకరించకపోవడంతో తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. 

దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. జెర్సీ రీమేక్ ఆఫర్ తనవద్దకు వచ్చిన సంగతి నిజమే అని తెలిపింది. ఆ చిత్రానికి నేను తగిన విధంగా న్యాయం చేయలేను. జెర్సీ అద్భుతమైన కథ. అందులో ఇన్వాల్వ్ అయి నటించాలి. ప్రస్తుతం ఆ చిత్రానికి నేను సిద్ధంగా లేదు. అందుకే అంగీకరించలేదు. కేవలం డబ్బు కోసమే తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కామెంట్ చేయడం సరికాదని రష్మిక పేర్కొంది. 

సినిమా అంటే డబ్బు మాత్రమే కాదు. సినీ సక్సెస్, ఫెయిల్యూర్ ఆ చిత్రంలో నటించే హీరో హీరోయిన్ల నటనపై ఆధారపడి ఉంటుంది అని రష్మిక పేర్కొంది. ఆ మధ్యన ఇళయదళపతి విజయ్ చిత్రానికి కూడా రష్మీ నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రష్మిక డేట్స్ కుదరకపోవడం వల్లే తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. జెర్సీ హిందీ రీమేక్ లో మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. 

ఫ్యాన్స్ కోరుకున్న జంటలు.. అట్టర్ ఫ్లాఫ్ అయిన చిత్రాలు!

ప్రస్తుతం రష్మిక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో, నితిన్ సరసన భీష్మ చిత్రంలో నటిస్తోంది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న హ్యాట్రిక్ చిత్రంలో కూడా రష్మికనే హీరోయిన్.