టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక  మందనకు గోల్డెన్ పీరియడ్ కొనసాగుతోంది. ఆమె పట్టిందల్లా బంగారం అవుతోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మండన వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక టాలీవడ్ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. 

వెండితెరపై గ్లామర్ లుక్ తో రష్మిక అదరగొడుతోంది. రష్మిక గ్లామర్, ఫిట్ నెస్ వెనుక ఎంత కష్టం దాగుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. రష్మిక జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏఈ వీడియోలో రష్మిక దాదాపు నిమిషం పాటు ఆగకుండా వివిధ రకాల కసరత్తులు చేస్తూ కనిపిస్తోంది. 

రష్మిక డెడికేషన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రష్మిక యువ హీరోయిన్లకు ఆదర్శం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఛలో చిత్రంతో టాలీవుడ్ లో రష్మిక తొలి సక్సెస్ అందుకుంది. చలాకీతనం, అందం, నటనతో పాటు విజయాలు కూడా దక్కుతుండడంతో టాలీవుడ్ లో రష్మిక తిరుగులేకుండా దూసుకుపోతోంది. 

హాట్ ఫొటోలు :బికినీలో ప‌వ‌న్ హీరోయిన్, అందాల ఆరబోతలో నెంబర్ వన్!

రష్మిక రీసెంట్ గా మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఘనవిజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక నితిన్ సరసన భీష్మ చిత్రంలో.. అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శత్వంలో నటిస్తోంది.