సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తోన్న తాజా చిత్రం “ప్రతీ రోజూ పండగే”. ఈ  సినిమాలో రాశి ఖన్నా ఓ గమ్మత్తైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమాలో.. రాశీ.. పాత్ర ద్వారా.. ఫుల్ ఫన్ వస్తుందని కొత్తరకంగా ట్రై చేసారని మీడియాలో ప్రచారం అవుతోంది. అది నిజమే అని తెలుస్తోంది. మారుతి ఈ సారి...టిక్ టాక్ పై దృష్టి పెట్టి నవ్వించటానికి ప్రయత్నించాడంటున్నారు.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి మరదలిగా నటిస్తున్న రాశి ఖన్నా ఏంజల్ ఆర్నా పాత్రలో ఆమె కనిపించబోతోంది. ఆమె టిక్ టాక్ కు బానిసైపోతుంది. ఎప్పుడు చూసినా టిక్ టాక్ వీడియో చేసుకుంటూ కాలక్షేపం చేస్తుందని, ఆమెతో ప్రేమలో పడ్డ సాయి తేజకు ..చిత్రమైన సమస్యలు ఎదురౌతూంటాయని సమాచారం.  టిక్ టాక్ సెలబ్రెటీగా ఆమె ఎదుగుతుందని, ఆ క్రమంలో ఆమెను రకరకాల సూపర్ హిట్ సాంగ్స్ తో చేసిన టిక్ టాక్ వీడియోలలో చూపిస్తారని తెలుస్తోంది.

read also:మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?

మారుతి ఈ మేరకు కొంత హోమ్ వర్క్ చేసి, పాటలు ఎంపిక చేసారని, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల పాటలుకు ఇందులో చోటు ఉందని చెప్తున్నారు. ఆ పాటల్లో రాశిఖన్నా ఎక్సప్రెషన్స్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. టిక్ టాక్ వీడియోతో కలిపిన ఓ పాటలో సాయి తేజ కూడా యాక్ట్ చేస్తాడని, ఇద్దరూ కలిపి చేసే టిక్ టాక్ చేసే ఆ పాటకు అదిరిపోతుందని చెప్తున్నారు.

రాశిఖన్నా మాట్లాడుతూ..ఈ సినిమా కోసం నేను టిక్ టాక్ ని ప్రాక్టీస్ చేసాను. నాకు టిక్ టాక్ ఇష్టం లేకపోయినా ఈ పాత్ర చేసాను. కానీ పాత్ర చేస్తున్నప్పుడు టిక్ టాక్ గొప్పతనం గురించి అర్దమైంది. చాలా మంది నా పాత్ర ను ఇష్టపడతారు అంది. ఇక ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది.