మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?
ఒక సినిమా సక్సెస్ కావాలంటే సంగీత దర్శకుల పనితనం కూడా కొన్నిసార్లు చాలానే ఉపయోగపడుతుంది. జనాల్లోకి సినిమా వెళ్ళాలి అంటే సంగీత దర్శకులపై ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక్క సాంగ్ క్లిక్కయినా సినిమాకి మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సౌత్ సంగీత దర్శకుల రెమ్యునరేష్ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.
మన సంగీత దర్శకుల జీతాలు ఇలా ఉన్నాయి
దేవి శ్రీ ప్రసాద్: ఈ రాక్ స్టార్ గత ఏడాది వరకు ఒక సినిమాకు 2కోట్ల లోపే తీసుకునేవారు. ఇక రీసెంట్ గా ఆయన వర్క్ చేస్తున్న సినిమాలకు 3కోట్లవరకు అందుకున్నట్లు తెలుస్తోంది.
థమన్ ఎస్ఎస్: వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న థమన్ ఒక కోటికి పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
అనిరుద్ రవిచందర్: కొలెవరి సాంగ్ తో ప్రపంచాన్ని ఊపేసిన ఈ యంగ్ కంపోజర్ మొదటి సినిమాకు 5 లక్షలు తీసుకున్నాడు. ఇక 2కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు.
ఏఆర్.రెహమాన్: ఆస్కార్ విజేత రెహమాన్ 1000రూపాయల జీతం నుంచి తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో ఆయన ఒకరు. సినిమా మార్కెట్ ని బట్టి 10కోట్లకు పైగా డిమాండ్ చేస్తారని టాక్.
MM.కీరవాణి: టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కంపోజర్ కీరవాణి ఎలాంటి సినిమా చేసినా అందులో ఒక్క పాటైనా వైరల్ అవుతుంది. రాజమౌళి సినిమాలకు అదిరిపోయేలా మ్యూజిక్ అందించే కీరవాణి 1.5కోట్ల వరకు అందుకుంటారని సమాచారం.
మణిశర్మ: 1990ల్లోనే ఒక పాటకు 90వేల వరకు అందుకున్న ఏకైక సంగీత దర్శకుడు మణిశర్మ. అనంతరం 50లక్షల వరకు వెళ్లింది. కొన్నిసార్లు సినిమా బడ్జెట్ ని పారితోషికం తీసుకునేవారు. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.
ఇళయరాజా: సీనియర్ మోస్ట్ సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకు 5కోట్ల వరకు అందుకున్నట్లు టాక్.
యువన్ శంకర్ రాజా: ఒక సినిమాకు 1.5కోట్లు
డి.ఇమ్మన్ : ఒక సినిమాకు కోటివరకు తీసుకుంటారు.
హరీస్ జయ రాజ్: ఒకప్పుడు కోటివరకు తీసుకునేవారు. ఇప్పుడు తగ్గినట్లు తెలుస్తోంది.
గోపి సుందర్: గీతా గోవిందం సాంగ్స్ తో మంచి క్రేజ్ అందుకున్న ఈ కంపోజర్ రేటు కూడా ఇప్పుడు 50లక్షలు దాటించినట్లు సమాచారం.
అనూప్ రూబెన్స్: సినిమా బడ్జెట్ ని బట్టి అనూప్ మొన్నటివరకు బాగానే అందుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళి అతని రెమ్యునరేషన్స్ 40లక్షల లోపే నడుస్తున్నట్లు టాక్.
శేఖర్ కమ్ముల - మిక్కీ జె మేయర్: హ్యాపీ డేస్ - లీడర్ - లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలకు మిక్కీని సెలెక్ట్ చేసుకున్న కమ్ముల ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని రాబట్టాడు. మిక్కీ జె మేయర్: మహానటి వరకు 40లక్షల లోపే పారితోషికం అందుకున్న మిక్కీ ఇటీవల వరుస హిట్స్ తో 70లక్షలు దాటించినట్లు తెలుస్తోంది.
జీబ్రాన్: ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న టెక్నీషియన్స్ లో జిబ్రాన్ ఒకరు. సినిమాకు 50లక్షల వరకు తీసుకుంటున్నట్లు టాక్.
కబాలి - కాల వంటి సినిమాలకు సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ పారితోషికం: 75లక్షలు
ఆదిత్య రామ చంద్రన్(హిప్ హాఫ్ తమిజన్) - తెలుగులో దృవ సినిమాకు మంచి మ్యూజిక్ అందించిన ఈ యువ కంపోజర్ తమిళ్ 75లక్షల వరకు తీసుకుంటాడని టాక్.