ప్రస్తుతం ఉన్న కాలంలో భార్యాభర్తలిద్దరూ సమానంగా సంపాదిస్తున్నారు. వారు ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ భార్య సంపాదనపై భర్తకి హక్కు ఉండదని అంటారు. ఇది సినీ ప్రముఖుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కొందరు హీరోయిన్ల సంపాదనను భర్తలే ఖర్చు చేస్తూ ఉంటారు.

అది వేరే విషయం. వారి సంగతులు ఎలా ఉన్నా.. బాలీవుడ్ దంపతులు దీపికా, రణవీర్ సింగ్ ల గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం ఇప్పుడు బయటకి వచ్చింది. దీపికకి ఫ్లాట్ ఉన్న ఓ బిల్డింగ్ లో రణవీర్ సింగ్ మరో ఫ్లాట్ లో అద్దెకి ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతీనెల 7.25 లక్షల రూపాయల రెంట్ ని చెల్లించి మరీ ఉంటున్నాడట.

గ్లామర్ గర్ల్ గా రోజా డాటర్.. హీరోయిన్ కి తక్కువేమి కాదు!

మూడేళ్లకి అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ఆ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితమే దీపికా సొంతంగా ఫ్లాట్ తీసుకుంది. పదేళ్ల క్రితమే ఏకంగా రూ.16 కోట్ల రూపాయలు చెల్లించి అక్కడ ఫ్లాట్ ని కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. అదే అపార్ట్మెంట్ ఉంటోన్న బిల్డింగ్ లో కొన్నేళ్లుగా అద్దెకి ఉంటున్నాడట రణవీర్.

వీరిద్దరూ ప్రేమలో పడినప్పటి నుండి రణవీర్ అక్కడ రెంట్ కి ఫ్లాట్ ని మైంటైన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే వీరి పెళ్లి అయిన తరువాత కూడా రణవీర్ ఆ రెంటెడ్ ఫ్లాట్ ని కొనసాగిస్తున్నాడని బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలా భార్యకి సొంత ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ లో భర్త అద్దె ఫ్లాట్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం.