బాలీవుడ్ లో డేటింగ్స్ - బ్రేకప్స్.. అనేవి చాలా కామన్ అని అందరికి తెలిసిన విషయమే. ఇక ఎన్నేళ్లు ప్రేమించుకున్నా కూడా చాలా ఈజీగా మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. సెలబ్రెటీల జీవితాల్లో బ్రేకప్స్ అనేవి సినిమా ఫెయిల్యూర్ లాంటిది. ఎవరు పెద్దగా పట్టించుకోరు. నెక్స్ట్ మరో సినిమాను వెతుకున్నట్లు మరోక పాట్నర్ ని పట్టేస్తారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎవరు ఊహించని విధంగా ఒక హీరోయిన్ కి సంబందించిన ఇద్దరు హీరోలు ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.. వారెవరో కాదు. రణ్ బీర్ కపూర్ - రణ్ వీర్ సింగ్. దీపికా పదుకోన్ తో కొన్నేళ్ళవరకు ప్రేమను కొనసాగించిన రణ్ బీర్ ఆమెకు బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. అనంతరం దీపిక రణ్ వీర్ తో ప్రేమలోకి దింపి చాలా వేగంగా పెళ్లి చేసుకుంది.

ఆ మధ్య రణ్ వీర్, రణ్ బీర్ కి మధ్య వివాదాలు కూడా చెలరేగినట్లు రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు అవేమి పట్టించుకోకుండా ఇద్దరు హీరోలు ఒక బిగ్ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఒపుకున్నారట. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాల్లో ఒకటైన ఓల్డ్ మూవీ ‘అందాజ్‌ అప్నా అప్నా(1994) కు సీక్వెల్ చేసేందుకు రాజ్‌కుమార్‌ సంతోషీ ప్రయత్నాలు చేస్తున్నారు.

also read గాయపడిన బాక్స్ ఆఫీస్ సింహాలు.. ఆశలన్నీ 2020పైనే..

ఆ హిట్ సినిమాలో సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్ నటించారు. ఇక ఇప్పుడు రణ్‌వీర్‌ సింగ్, రణ్‌బీర్‌ కపూర్‌ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. ఇక రణ్ బీర్ తో దీపిక ఒక సినిమాలో నటించడానికి కూడా ఒప్పుకున్నట్లు టాక్ వస్తోంది.