బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ లో రాణి ముఖర్జీ ఒకరు. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ చేసిన రాణి ముఖర్జీ ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. గత ఏడాది రాణి ముఖేర్జీ మర్ధానీ 2 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాణీముఖర్జీ భర్త ఆదిత్య చోప్రానే నిర్మించారు. 

ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీ బాలీవుడ్ సెలెబ్రిటీ కపుల్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల రాణి ముఖర్జీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్త ఆదిత్య చోప్రాని మరో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో పోల్చింది. కారం జోహార్ కు ఉన్న అలవాట్లు తన భర్తకు వద్దని చెప్పింది. 

అబ్బో 'ఉప్పెన'కు అంత సీన్ ఉందా.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

నా భర్త కరణ్ జోహార్ లాగా ఉండిఉంటే అసలు ప్రేమించేదాన్నే కాదు. కరణ్ జోహార్ తన వ్యక్తిగత విషయాలని కూడా మీడియాతో పంచుకుంటారు. ఆయన మీడియా ఫ్రెండ్లీ పర్సన్. నాకు అలా ఉంటే నచ్చదు. నేను వ్యక్తిగత విషయాలని నా కుటుంబం వరకు మాత్రమే పరిమితం చేస్తాను. అలాగే కరణ్ జోహార్ కు పార్టీలంటే కూడా బాగా ఇష్టం. 

కానీ నేను, నా భర్త అలా కాదు.. షూటింగ్ పూర్తి కాగానే ఆయన ఇంటికి వచ్చేస్తారు. అలాగే ఇంట్లో విషయాలని మీడియా ముందు పెట్టరు. ఆదిత్య చోప్రాలో నాకు నచ్చిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఒకవేళ నా భర్త కూడా కరణ్ జోహార్ లాగే ఉంది ఉంటే ఆయన్ని ప్రేమించే దాన్నే కాదేమో అని రాణి ముఖర్జీ తెలిపింది.