ఆదివారం రాత్రి ముంబైలో స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్లు కార్తిక్ ఆర్యన్, అలియా భట్, దీపిక పదుకోన్, రణవీర్ సింగ్,  అనన్య పాండే తదితరులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కూడా పాల్గొంది.

'గల్లీబాయ్' సినిమాకి గాను అలియాకి ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. అయితే షో ప్రారంభం అయిన తరువాత తీసుకోవాల్సిన అవార్డుని అలియా ముందే తీసేసుకుంది. పైగా ఎవ్వరికీ తెలియకుండా షో జరుగుతున్న ప్రదేశం వెనుక డోర్ నుండి బయటకి వెళ్లిపోయారు అలియా.

తెరపై మెరుపులు.. తెర వెనుక రోగాల బాధలు!

ఈ విషయం తెలుసుకున్న మీడియా వర్గాలు వెంటనే అక్కడకి వెళ్లి అలియా ఫోటోలు క్లిక్ మనిపించారు. దాంతో అలియా కూడా ఫోటోలకు ఫోజులివ్వాల్సి వచ్చింది. ఆ సమయం తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో అలియాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

పైగా అలియా అవార్డు తీసుకున్న విషయాన్ని షో మొదలైన రెండు గంటల తరువాత టీవీలో ప్రసారం చేయాలని అలియా మేనేజర్ మీడియాని హెచ్చరించారట. ఈ విషయంపై బాలీవుడ్ నటి కంగనా సోదరి రంగోలి కామెంట్స్ చేసింది. కనీసం ఈ పనైనా ఎవరికీ తెలియకుండా చేస్తోందని.. ఆ మాత్రం సిగ్గు ఉన్నందుకు ఆనందిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. 

దీన్నే అవార్డు ఫిక్సింగ్ అంటారు అంటూ సెటైర్లు వేసింది. అయితే అలియా ఇలా ఎందుకు చేశారనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు. అవార్డు తీసుకొని వెనుక నుండి వెళ్లిపోవడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.