కెరీర్ ఆరంభంలో విలన్ రోల్స్ చేసిన గోపీచంద్.. ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. గోపీచంద్ ఆంధ్రుడు, లక్ష్యం, రణం, శౌర్యం, సౌఖ్యం లాంటి హిట్ చిత్రాల్లో నటించాడు. మీడియం రేంజ్ లో తెరకెక్కే గోపీచంద్ మూవీస్ నిర్మాతలకు మంచి లాభాలని తెచ్చిపెట్టేవి. 

ప్రస్తుతం గోపీచంద్ ఓ సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉండగా 2018లో గోపీచంద్ డెబ్యూ దర్శకుడు చక్రి(కె చక్రవర్తి) దర్శత్వంలో నటించిన చిత్రం పంతం. సోషల్ ఎలిమెంట్ ఉన్న పాయింట్ కు కమర్షియన్ హంగులు జోడించిన దర్శకుడు చక్రి ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. 

మాస్ ప్రేక్షకులని కూడా ఈ చిత్రం అలరించింది. కానీ థియేటర్స్ లో పంతం మూవీ యావరేజ్ గా మాత్రమే నిలిచింది. గోపీచంద్ పెర్ఫామెన్స్ కు, దర్శకుడు చక్రి టేకింగ్ కు ప్రశంసలు దక్కాయి. కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడైనా నెట్టుకొస్తోంది అనేందుకు పంతం చిత్రమే ఉందాహరణ. 

ఎందుకంటే పంతం మూవీ ప్రస్తుతం ప్రస్తుతం ఓటిటీ ఫ్లాట్ ఫామ్ లో దూసుకుపోతోంది. సన్ నెక్స్ట్ లో పంతం మూవీ మోస్ట్ వాచ్డ్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పంతం చిత్రాన్ని ఇంట్లోనే ఉంటూ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. 

బ్రా లేకుండా పార్టీలో క్రేజీ హీరోయిన్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

పంతం చిత్రంలో గోపీచంద్ కు జోడిగా యంగ్ బ్యూటీ మెహ్రీన్ నటించింది. గోపి సుందర్ ఈ చిత్రాన్ని సంగీతం అందించారు. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.