ప్రముఖ నిర్మాత సురేష్ బాబుకు మోస్ట్ ఫెరఫెక్టనిస్ట్ గా పేరుంది. తను అనుకున్నది వచ్చేవరకూ స్క్రిప్టు మార్పులు, కరక్షన్స్ పేరుతో రీషూట్స్ లు చేయిస్తారని వినికిడి. అయితే ఇది సినిమాకు బాగా రావటానికి ఉపయోగపడచ్చేమో కానీ దర్శకులకు తాము అనుకున్నది తెరకెక్కిస్తే కరక్షన్స్ పేరుతో నెలలు తరబడి విసిగిస్తున్నట్లు అనిపిస్తూంటుంది. ఎందుకంటే క్రియేటివిటి విషయంలో ఎంవరికి వారిదే కరెక్ట్ అనిపిస్తుంది కనుక. "క్షణం" డైరక్టర్ కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైందట.

అడవి శేషుతో చేసిన థ్రిల్లర్  "క్షణం" సినిమాకి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత అడివి శేష్ వరస సినిమాలు చేస్తూ రిలీజ్ చేస్తూనే ఉన్నారు..ఓ రకంగా ఆయన కెరీర్ స్థిర పడిపోయింది.  కానీ  డైరక్టర్ రవికాంత్ పేరు మాత్రం ఆ తర్వాత ఏమైపోయాడో ఎవరికీ అర్దం కాలేదు. ఆ సినిమా పూర్తి కాగానే  రానా పిలిచి మెచ్చుకుని, సురేష్ బాబు నిర్మాణంలో ఒక చిన్న సినిమా ఆఫర్ ఇచ్చారు.

మల్టీప్లెక్స్ లో భారీ రేట్లు.. మండిపడ్డ హీరో నిఖిల్!

ఆ సినిమా పూర్తి చేసి  రిలీజ్ చేయక అలా మిగిలిపోయారు. క్షణం డైరక్టర్ ని అందరు మర్చిపోయారు. దా్ంతో ఓ రకంగా నిరాశే పరిస్దితే. కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది. పూర్తి చేసిన సినిమా సురేష్ బాబు ఒక సినిమాని ఒక పట్టాన రిలీజ్ కి ఒప్పుకోకుండా ..కరెక్షన్స్ అంటూ అలాగే ఉంచేసేరని సమాచారం. దాంతో డైరక్టర్ ఇంక చేసేదేముంది అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు.

అయితే ఈ మధ్యనే ఆపరేషన్ పూర్తి చేసుకుని వచ్చిన హీరో దగ్గుపాటి రానా సీన్ లోకి వచ్చాడు. ఈ డైరక్టర్ గురించి తెలుసుకుని, అతని భాధ అర్దం చేసుకుని సినిమా రిలీజ్ కు పెట్టాడు. ఈ  చిత్రాన్ని సమర్పిస్తూ పోస్టర్ రిలీజ్ చేసి కాస్త రిలీఫ్ ఇచ్చాడా డైరక్టర్ కు. ఈ సినిమాకు  అఫీషియల్ ప్రకటనను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాను రానా సమర్పించబోతున్నాడు. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, శీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. 

ఆగష్టులోనే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ డిసెంబర్ 11న విడుదల కానుంది.  ఈ చిత్రం నిజ జీవితంలో వచ్చిన రూమర్ల ఆధారంగా తెరకెక్కడం విశేషం. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది. ఏదేమైనా 2016లో క్షణం మూవీని తెరకెక్కించిన రవికాంత్ పేరేపు దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఈ రెండో సినిమా రిలీజ్ కు రెడీ అవటం గమనార్హం.