నటుడు రానా దగ్గుబాటి నటించిన '1945' సినిమాకి సంబంధించి తాజాగా ఓ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ పోస్టర్ ని రానా షేర్ కానీ పోస్ట్ కానీ చేయలేదు. పైగా చిత్రనిర్మాతలపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. చాలా రోజుల క్రితం రానా హీరోగా '1945' అనే సినిమాను మొదలుపెట్టారు. పీరియాడిక్ ఫిలిం గా ఈ సినిమాను 
రూపొందించనున్నట్లు అనౌన్స్ చేశారు.

ఆ తరువాత రానా బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది. సినిమాకి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా తెలియలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ దీపావళి సందర్భంగా పోస్టర్ ని విడుదల చేయడంతో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

యూట్యూబ్ లో ఈ పాటల రికార్డులు.. మిలియన్లలో వ్యూస్!

కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజరంజన్ నిర్మిస్తోన్న ఈ సినిమాని శివ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన కాసేపటికి హీరో రానా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా పూర్తి కాలేదని, రెమ్యునరేషన్ విషయంలో మోసం చేయడంతో సినిమా పూర్తి కాలేదని అన్నారు.

ఏడాది కాలంగా చిత్రయూనిట్ ని కూడా కవలేదని.. ఇలా పోస్టర్స్ రిలీజ్ చేసి మార్కెట్ పరంగా అందరినీ మోసం చేసి డబ్బు చేసుకోవడానికి చూస్తున్నారని.. ఇలాంటి వారిని నమ్మకండి అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు. అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత రానాపై మండిపడ్డాడు.

అరవై రోజుల పాటు షూటింగ్ జరిపామని, కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. పూర్తి కాని సినిమాను ఎలా రిలీజ్ చేస్తామని ప్రశ్నించారు. సినిమా పూర్తయిందో లేదో  నిర్ణయించాల్సింది దర్శకుడని కౌంటర్ ఇచ్చారు. మరి ఈ వివాదం ఇంకెంత రాజుకుంటుందో చూడాలి!