సినీ నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ ‘క్వీన్’. రమ్యకృష్ణ టైటిల్ రోల్ పోషించిన ఈ సీరిస్... డిసెంబర్ 14 నుంచి ఎంఎక్స్ ప్లేయర్‌లో ‘క్వీన్’ ప్రసారమవుతోంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో  ఈ వెబ్ సీరిస్ ని తెలుగులోనూ డబ్ చేసి వదులుతున్నారు. ఈ రోజు నుంచే  ఈ షో ప్రసారం కానుంది. ఈ మేరకు ట్రైలర్ ని సైతం వదిలారు.

2019 ఇయర్ రౌండప్ : స్వర్గస్తులైన టాలీవుడ్ సెలబ్రెటీలు

ఈ వెబ్ సీరిస్ లో జయలలిత బాల్యం నుంచి రాజకీయ నేతగా ఎదిగిన తీరుని చూపించారు. సీరిస్ లో రమ్యకృష్ణ తనదైన మార్క్ ఆహార్యంతో మెరిపించారు. విద్యార్థినిగా మరో యువనటిని.. నటిగా మరో తారను.. చివరికి రాజకీయ నేతగా మారిన జయ పాత్రలో రమ్యకృష్ణను ఇలా వివిధ రూపాల్లో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు.

గౌతమ్ మీనన్ తనదైన శైలిలో క్లాస్సీగా ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇక అమ్మగా నీలాంబరిని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.  ఈ వెబ్ సీరిస్ తో పాటు ఏ.ఎల్.విజయ్ ‘తలైవి’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ పురుచ్చితలైవి జయలలితగా నటిస్తోంది. మరోవైపు నిత్యామీనన్‌ కీలక పాత్రలో “ది ఐరన్‌ లేడీ’ పేరుతో మహిళా దర్శకురాలు ప్రియదర్శి ఓ సినిమా చేస్తోంది.