సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహర్షి తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న చిత్రం ఇదే. మరోవైపు వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సరిలేరు నీకెవ్వరు మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ కి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 5న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. 

భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించారు. తాజా సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. చిరు, మహేష్ పలు సందర్భాల్లో కలుసుకున్నారు. కానీ తమ చిత్రాల ఈవెంట్స్ లో మాత్రం కలుసుకోలేదు. మహేష్, మెగాస్టార్ ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు కనుల పండుగే అని చెప్పొచు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

అలీ తల్లి మృతి.. మెగాస్టార్ నివాళి

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, మాస్ ప్రేక్షకులని కూడా మెప్పించేలా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి వెండితెరపై రీఎంట్రీ ఇస్తోంది. మహేష్ సరసన ఈ చిత్రం రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, సంగీత, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.