నడుము సుందరి ఇలియానా కెరీర్ ప్రస్తుతం డల్ గా సాగుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో ఇలియానా తిరుగులేని హీరోయిన్. టాలీవుడ్ ఇలియానా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఒకప్పుడు దూసుకుపోయింది. కానీ బాలీవుడ్ కు వెళ్లినప్పటి నుంచి ఇలియానాకు సరిగా కలసి రావడంలేదు. 

అరా కొర అవకాశాలతోనే ఇలియానా కాలం గడుపుతోంది. ఇలియానా 2018లో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. హీరోయిన్ గా ప్రస్తుతం ఇలియానాకు టైం కలసి రాకపోతుండటంతో కొత్త అవతారం ఎత్తేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తాజాగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఇలియానా యాంకర్ గా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా స్పోర్ట్స్ యాంకర్ అట. ఈ మేరకు ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ ఇలియానాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇంట్లో నుంచి వెళ్లకుండా జాన్వీ కపూర్ ని కొరికేస్తోంది.. వైరల్ వీడియో!

తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే స్పోర్ట్స్ యాంకర్ గా మారేందుకు ఇలియానా కూడా రెడీగా ఉన్నట్లు టాక్. రాబోవు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఇండియాలో అర్చన విజయ, మయంతి లంగర్ లాంటి హాట్ స్పోర్ట్స్ యాంకర్స్ ఉన్నారు.