టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న సీనియర్ నటీమణుల్లో రమ్య కృష్ణా ఒకరు. బాహుబలి నుంచి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తో అలరిస్తున్న శివగామి ఇప్పుడు యువ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపిస్తోంది. రమ్యకృష్ణ నటిస్తోంది అంటే చాలు సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ లో ఉన్న పాత్ర ఒకటి ఉంటుందని చెప్పవచ్చు.

శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో కూడా రమ్య కృష్ణ చేసిన పాత్ర సినిమాలో హైలెట్ గా నిలిచింది. అసలు మ్యాటర్ లోకి వస్తే..  ఆఫర్స్ పెరుగుతున్న కొద్దీ రమ్యకృష్ణ రెమ్యునరేష్ డోస్ కూడా పెరుగుతోందట. నెక్స్ట్  మెగా హీరో సినిమాలో కూడా దేవసేన స్ట్రాంగ్ క్యారెక్టర్ లో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. యువ హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

also read: మందిరాబేడీకు ట్విస్ట్... రమ్యకృష్ణతో రీషూట్...పూరి రిపేర్లు

ఇటీవల ఆ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇకపోతే సినిమాలో నటించడానికి రమ్యకృష్ణ ఒక సీరియస్ కండిషన్ పెడుతోందట. కథలో తన పాత్ర కీలకమైతేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటానని ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే డేట్స్ కి తగ్గటుగా షూటింగ్ లో పాల్గొంటానని చెబుతోందట. గతంలో డైలీ పేమెంట్ తీసుకున్న ఈ సీనియర్ నటీమణి ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ తో సమానంగా రెమ్యునరేష్ తీసుకుంటోదట.

గ్యాప్ లేకుండా ఆఫర్స్ వస్తుండడంతో రమ్య కృష్ణ తొందరపడకుండా మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది. కేవలం తనకు సెట్టయ్యే పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాతో పాటు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ నటిస్తున్న రొమాంటిక్ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. అలాగే చాలా రోజుల తరువాత భర్త కృష్ణవంశీ దర్శకత్వం వహించబోతున్న రంగమార్తాండ సినిమాలో కూడా రమ్యకృష్ణ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనుంది.