ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా చిత్రం ‘రొమాంటిక్’.   అనిల్ పాదూరి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో ఎంపిక చేసారు. అయితే మొదట రమ్యకృష్ణ సీన్ లో లేదు. మందిరాబేడీతో సీన్స్ తీసారు. అయితే పూరి మొత్తం సినిమా చూసుకుని..  ఆ సీన్స్ బాగా రాకపోవడంతో ఇప్పుడు మందిరా బేడి ప్లేస్ లో రమ్యకృష్ణను పెట్టి ఆ సీన్స్ ను రీషూట్ చేస్తున్నారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూరి దగ్గరుండి మరీ రిపేర్లు చేస్తున్నట్లు సమాచారం. పూరి సీన్ లోకి రావటంతో రమ్యకృష్ణ ఒప్పుకున్నట్లు సమాచారం.

`బాహుబ‌లి` చిత్రంలో రాజ‌మాత శివ‌గామి న‌టించి సినీ ప్రేక్షకుల‌ను మెప్పించిన ర‌మ్యకృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్రలో న‌టిస్తున్నారని తెలియటంతో ట్రేడ్ లోనూ   ‘రొమాంటిక్‌’.పై అంచనాలు పెరిగిపోయాయి.  ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌న‌ప‌డ‌నుందని తెలుస్తోంది. మంగ‌ళ‌వారం నుంచి జ‌రుగుతున్న షెడ్యూల్‌లో ర‌మ్య‌కృష్ణ జాయిన్ అయ్యారని తెలిసింది. ఇక ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ క‌శ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. న‌రేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మకరంద్‌ దేశ్‌ పాండే, ఉత్తేజ్‌, సునైన తదితరులు ఈ చ్రితంలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కతోంది మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.