తమ కెరీర్ కు ప్లస్ అవుతుందనుకుంటే రెమ్యునేషన్ విషయంలో తగ్గటానికి వెనకాడరు ఆర్టిస్ట్ లు. ముఖ్యంగా కెరీర్ నెమ్మిందించినప్పుడు తమ దగ్గరకు వచ్చిన ఆఫర్ మంచిదైతే దాన్ని ఒడిసిపట్టడానికి రెమ్యునేషన్ తగ్గింపు అనే అస్త్రం వాడుతూంటారు. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ తో సినిమా కమిటవ్వటానికి రమ్యకృష్ణ అదే చేసిందని సమాచారం. యూత్ లో క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాకు హీరో కావటం కూడా ఆమె కన్సిడర్ చేసి తగ్గించుకుందని చెప్తున్నారు.

 బాహుబలి చిత్రం తర్వాత రమ్యకృష్ణ...రోజుకు ఆరు నుంచి పది లక్షలు దాకా తీసుకుంటోందని వినికిడి. సినిమాకు పది నుంచి పదిహేను రోజులు డేట్స్ ఎలాట్ చేయాలంటే కోటిపైగానే డ్రా చేస్తోంది. అయితే పూరి జగన్నాథ్ సినిమా కోసం ఆమె దాన్ని సగానికి సగం తగ్గించుకుందిట.  పూరి ఆమె కోసం రాసిన క్యారక్టర్ చాలా బాగుందని, ఆ పాత్ర తనకు శివగామి తరహాలో పెద్ద పేరు తెస్తుందని భావిస్తోందిట. ఆ పాత్ర కోసం ఆమె పూరి కుమారుడు ఆకాష్ పూరి తో చేస్తున్న రొమాంటిక్ సినిమాలో పాత్ర కూడా కమిటైంది. అలా పూరి...రమ్యకృష్ణతో ప్యాకేజ్ క్రింద రెండు సినిమాలు ఓకే చేయించారు.

సురేష్ బాబుతో మాట్లాడి పెళ్లి చేసుకోమన్నారు.. శ్రీరెడ్డి కామెంట్స్!
 
‘బాహుబలి’ చిత్రంలో శివగామి పాత్ర తర్వాత ఆమె ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో అత్త పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కుతున్న ‘రొమాంటిక్‌’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి అనిల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో మంచి విజయం అందుకున్న పూరీ జగన్నాథ్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆకాష్‌ పూరీ హీరోగా ‘ఆంధ్రాపోరి’, ‘మెహబూబా’ చిత్రాల్లో నటించారు. గతేడాది విడుదలైన ‘మెహబూబా’ సినిమాకు ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు.