వివాదాస్పద నటి శ్రీరెడ్డి తరచూ తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని ఓపెన్ చేసి తనకు సంబంధించిన విషయాలను, అభిప్రాయాలను అందులో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

తాజాగా లైవ్ చాట్ లో పాల్గొన్న ఈమె ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. తనకు పెళ్లి ఆలోచన లేదని.. సమాజ సేవ కోసం తన జీవితం అంకితం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.

ఇల్లీ బేబీ హాట్ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్!

తన జీవితంలో జరిగిన సంఘటనలు, అవమానాతో ప్రేమ, పెళ్లి అనే అంశాల గురించి ఆలోచించాలని కూడా అనుకోవడం లేదని తెలిపింది. సురేష్ బాబుతో మాట్లాడి అభిరామ్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చు కదా అని చాలా మంది సలహాలు ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేసింది.

అలాంటి వారందరికీ తను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నానని.. ఎన్ని కోట్లు ఉన్నా.. ప్రశాంతత అనేది ఒకటి ఉంటుందని.. అది లేకపోతే అన్ని జబ్బులు వస్తాయని.. ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండటం కావాలని చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించబోతున్నట్లు తెలిపింది.

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దొరక్క కష్టపడుతున్న ఫ్రెషర్స్ కోసం అవకాశాలు కల్పిస్తానని.. ముందు తమిళనాడుకి చెందిన వారికే అవకాశాలు ఇస్తానని.. ఆ తరువాత తెలుగు వారి గురించి ఆలోచిస్తానని చెప్పింది. మంచి అవకాశాలు వస్తే సినిమాలు చేస్తానని.. లేకపోతే వేరే కెరీర్ చూసుకుంటానని.. అంతేతప్ప ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తూ సమయం వృధా చేయనని చెప్పింది.