యూత్ హీరో రామ్ పోతినేని రెడ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న అనంతరం రెస్ట్ తీసుకున్న ఈ యువ హీరో నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సమయం చాలానే తీసుకున్నాడు. ఇక ఎట్టకేలకు హోమ్ బ్యానర్ లో కిషోర్ తిరుమలతో సినిమాను మొదలుపెట్టాడు. నేడు రెడ్ సినిమా పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా సెట్స్ పైకి వచ్చింది.

గత కొంత కాలంగా అనేక కథలను వింటున్న రామ్ ఫైనల్ గా మరో మాస్ కథను ఒకే చేశాడు. రెడ్ సినిమాలో పలు థ్రిల్లర్ అంశాలు కూడా ఉంటాయట. రామ్ ఫస్ట్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో మరో స్మార్ట్ హిట్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో సినిమా మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ కి చిత్ర యూనిట్ ప్లాన్ రెడీ చేసుకుంది. మొదట షూటింగ్ స్టార్ట్ చేసిన అనంతరం మిగతా వివరాలను తెలియజేయాలని ఆలోచిస్తున్నారు.

రామ్ డబుల్ దిమాక్.. చేతిలో నాలుగు కథలు 

గతంలో రామ్ తో నేను శైలజా - ఉన్నది ఒక్కటే జిందగీ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ ఈ సారి డిఫరెంట్ యాక్షన్ జానర్ ని ఎంచుకోవడం చూస్తుంటే సినిమా మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రెడ్ సినిమా లాంచ్ కి దర్శకుడు పూరి జగన్నాథ్ - ఛార్మి ప్రత్యేక అతిధులుగా హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు.స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.