దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా కుర్ర హీరో రామ్ మొన్నటివరకు బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ తో సతమతమైన సంగతి తెలిసిందే. ఫైనల్ గా రామ్ ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ మాస్ ఎంటర్టైనర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందించింది.

మొత్తానికి ఫామ్ లో లేడనుకున్న రామ్ మాస్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దీంతో ఇక నుంచి తనకు సెట్టయ్యే కథలను ఎంచుకొని సక్సెస్ అందుకోవాలని ఈ యువ హీరో ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ రామ్ కి ఇటీవల వచ్చిన 10కథల్లో ఏ కథ కూడా నచ్చలేదని టాక్ వస్తోంది. మాస్ కథలు కావాలని చెప్పగా ఇద్దరు దర్శకులు స్పెషల్ గా రెండు వేరియేషన్స్ లో కథను నేరేట్ చేసినప్పటికీ రామ్ సంతృప్తి చెందడం లేదట.

ఒక నాలుగు ప్రాజెక్టులు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన ఈ యువ హీరో ముందు దేన్ని స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ లో పడ్డాడట. ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ తో మాస్ ఫ్లోను కంటిన్యూ చేయాలా లేక లవర్ బాయ్ గా డిఫరెంట్ గా కనిపించాలా? అని డబుల్ దిమాక్ తో ఆలోచిస్తున్నాడట అయితే రామ్ ఫ్యాన్స్ మాత్రం అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండ అతని సెలెక్ట్ చేసుకునే కథపై మాత్రం అంచనాలు పెరుగుతాయి. మరి రామ్ ఎలాంటి కథను ఎంచుకుంటాడో చూడాలి.