వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్మ నోరు తెరిస్తే ప్రతి మాట సంచలనమే.. వివాదమే. వర్మ మాటలు, చర్యలు అలాగే ఉంటాయి. తన సినిమాల విషయంలో కూడా వర్మ వివాదాస్పద కథలనే ఎంచుకుంటారు. 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ ప్రముఖులు కూడా ఖాళీగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినీ తారలంతా పిల్లో ఛాలెంజ్, బి ది రియల్ మాన్, కాఫీ ఛాలెంజ్ ఇలా పలు ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ పై వకీల్ సాబ్ డైరెక్టర్ కామెంట్.. శృతి హాసన్ ఇప్పటికీ..

ఈ నేపథ్యంలో మీరు ఎవరికైనా ఎలాంటి ఛాలెంజ్ ఇస్తారు అని యాంకర్ ప్రశ్నించగా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చుక్క లేక మందు బాబులంతా విలవిల లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో తాను కేసీఆర్ కు ఓ ఛాలంజ్ ఇస్తున్నానని వర్మ అన్నాడు. 

కేసీఆర్ కు విస్కీ ఛాలెంజ్ ఇస్తున్నా. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లోనే ఒక పెగ్గేయాలి. ఆ సమయంలో మందుబాబుల రియాక్షన్ తాను చూడాలని అనుకుంటున్నట్లు వర్మ తెలిపాడు. మొత్తంగా మరోసారి తాను నోరు తెరిస్తే ఇలాంటి వ్యాఖ్యలే బయటకు వస్తాయని వర్మ నిరూపించుకున్నారు.