పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఉంది. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఉంది. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. కరోనా లేకుంటే ఈపాటి వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతూ ఉండాలి.
లాక్ డౌన్ కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా వేణు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో వకీల్ సాబ్ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ చేసిన హార్డ్ వర్క్ అభినందనీయం అని తెలిపాడు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కూడా. దీనితో రాజకీయ కార్యక్రమాలకు హాజరు కావలసిన పరిస్థితి. దీని కోసం పవన్ ప్రతి రోజు ఉదయం విజయవాడకు వెళ్లి తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన షూటింగ్ లో పాల్గొనేవారని వేణు శ్రీరామ్ తెలిపారు. పవన్ ఒక్క రోజు కూడా షూటింగ్ కు మిస్ కాలేదని అన్నారు.
భర్తతో విడాకులు.. మరోసారి డిప్రెషన్ లోకి హీరోయిన్
ఇది పవన్ కు తన వర్క్ పట్ల ఉన్న అంకితభావం అని వేణు శ్రీరామ్ అన్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తయింది అని.. మిగిలిన భాగం లాక్ డౌన్ ఎత్తివేయగానే పూర్తి చేస్తామని వేణు శ్రీరామ్ అన్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కు జోడిగా ప్రత్యేకమైన పాత్రలో శృతి హాసన్ నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.
కానీ ఆ వార్తలని శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఖండించింది. తాజాగా వేణు శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వకీల్ సాబ్ లో శృతి హాసన్ నే నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ పూర్తి కాగానే ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేసే అవకాశం ఉందని వేణు శ్రీరామ్ అన్నారు. అంటే ఇప్పటికి వకీల్ సాబ్ లో శృతి హాసన్ నటించే అవకాశాలు ఉన్నాయన్నమాట.
