సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ సెన్సార్ అలానే పలు సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.

ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్, నారా లోకేష్ లాంటి వాళ్ల పాత్రల్ని ఈ సినిమాలో ఎంత ఎగతాళి చేసి, విమర్శించి చూపించారో ప్రోమోలు చూస్తే అర్ధమవుతోంది.ప్రోమోల కారణంగా సినిమాకి పబ్లిసిటీ ఓ రేంజ్ లో వచ్చింది. రిలీజ్ కి ముందు బజ్ మాములుగా లేదు.

మారుతి హిట్, ఫ్లాప్ సెంటిమెంట్.. వర్కవుట్ అవుతుందా..?

కానీ సినిమా రిలీజ్ కి మాత్రం అడ్డంకులు వచ్చి పడ్డాయి. సాధారణంగా వర్మ సినిమాలకు ఇలాంటి గొడవలు ఉంటూనే ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రచారానికి పనికొస్తాయని భావించాడు. కానీ ఈ గొడవలు, కోర్టు కేసులు, సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.

సెన్సార్ వాళ్లు ఈ సినిమా విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాలో దాదాపు తొంబై శాతం సన్నివేశాల్లో మార్పులు చేయాలని సూచించారు. దీంతో ఈ సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లింది.

అక్కడ కూడా కష్టమని భావించారు కానీ రివైజింగ్ కమిటీ ఈ సినిమాకి 'యూ/ఏ' సర్టిఫికేట్ ఇచ్చింది. అలానే కొన్ని కట్స్ సూచించినట్లు తెలుస్తోంది. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే పేరుతో సినిమాని విడుదల చేయనున్నారు. డిసంబర్ 12న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేశారు.