సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. అందులో ఓ వ్యక్తి తన ఇంటి ప్రాంగణంలో ఉన్న జింకలను తుపాకీతో కాల్చుతున్నాడు. ఈ వీడియో షేర్ చేసిన వర్మ.. సల్మాన్ కి ఒక న్యాయం.. ఇంకొకరికి ఇంకో న్యాయమా అంటూ ప్రశ్నించాడు.

దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంటే.. ఈ ప్రశ్నకి పోలీసులు, న్యాయస్థానం సమాధానాలు చెప్పాలని అడిగారు. సల్మాన్ చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే.. అతడు సెలబ్రిటీ కావడమేనని.. అందుకే పోలీసులు అతడిని శిక్షించాలని అనుకుంటున్నారని తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.

మహేష్ అండతో మొత్తానికి ఒడ్డున పడ్డ మెహర్ రమేష్!

అయితే ఈ వీడియో చూసిన పర్వీన్ కస్వాన్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి వర్మకి కౌంటర్ ఇచ్చాడు. ఆ వీడియో ఇక్కడిది కాదని అన్నారు. మీరు ఈ ప్రశ్నని బంగ్లాదేశ్ పోలీసులను అడగాలని.. ఎందుకంటే ఈ వీడియో ఇండియాలోది కాదని.. బంగ్లాదేశ్ కి చెందిన వీడియో అని.. కచ్చితంగా చెప్పాలంటే చిట్టగాంగ్ లోని వ్యక్తికి సంబంధించినదని.. వర్మకి క్లాస్ పీకారు.

1990లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్.. రాజస్తాన్ లోని జోద్ పూర్ అడవుల్లో కృష్ణజింకలను వేటాడారు. ఆ సమయంలో సల్మాన్ తో పాటు సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, టబు కూడా ఉన్నారు.

కోర్టు వాళ్లను నిర్దోషులుగా తేల్చి సల్మాన్ కి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ సల్మాన్ బెయిల్ పై బయటకొచ్చారు. కేసుని మరోసారి పరిశీలించాలని జోద్ పూర్ కి చెందిన సెషన్స్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.