పెద్ద వాళ్ల స్నేహం చాలా రకాలుగా కలిసి వస్తుంది. ఆ విషయం ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసారు మెహర్ రమేష్.  ఎందుకంటే డైరక్టర్ గా మెహర్‌ రమేష్‌ పేరును టాలీవుడ్‌ దాదాపు మరిచిపోయింది. మెహర్‌ రమేష్‌ కన్నడంలో ఎంత పెద్ద డైరెక్టర్‌ అనిపించుకున్నా తెలుగుకి వచ్చేసరికి డిజాస్టర్ కా బాప్ డైరెక్టర్‌ అయిపోయారు. దాంతో ఆయనతో సినిమా అంటే హీరోలు మొహం చాటేసి పరిస్దితి వచ్చింది.

అదే వేరే డైరక్టర్ అయితే ఆ డిప్రషెన్ లో ఇండస్ట్రీకి దూరమై, చెడు అలవాట్లకు దగ్గరయ్యేవాడు. కానీ మెహర్ రమేష్ ..జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. వాస్తవాలని గుర్తించి మహేష్ తో స్నేహం కంటిన్యూ చేసాడు. బాబి సినిమా సమయంలో జరిగిన పరిచయాన్ని కంటిన్యూ చేసారు.  మహేష్‌బాబుతో చిన్న చిన్న యాడ్స్ చేస్తున్న ఈ దర్శకుడికి మహేష్‌ బాబు మంచి బూస్టు ఇచ్చారు.

అసభ్య పదజాలం, అశ్లీల వీడియోలు.. నటికి వేధింపులు!
 
మహేష్ సహకారంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గుంటూరు రైట్స్‌ మెహర్‌ రమేష్‌ దక్కించుకున్నారు. దాంతో మొదటే అక్కడ అడ్వాన్సుల రూపంలోనే ఆయన పెట్టుబడి వచ్చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, కలెక్షన్లు కూడా దుమ్మురేపటంతో మెహర్‌కు భారీ లాభాలు వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. దాంతో మెహర్ రమేష్ తన ఫైనాన్సియల్ ఒత్తిడిల నుంచి బయిటపడ్డాడని తెలుస్తోంది.

మహేష్‌బాబు అండతో డిస్ర్టిబ్యూటర్‌ అవతారమెత్తి, తొలి చిత్రంతోనే భారీ సక్సెస్ అందుకున్న మెహర్‌ రమేష్‌ ముందుముందు ఈ సక్సెస్‌‌ను ఇలానే కంటిన్యూ చేస్తారనే అంతా భావిస్తున్నారు. రాబోయే మహేష్ సినిమాలు సైతం ఆయన కొన్ని ఏరియాలు తీసుకుని మరింతగా సెటిల్ అవుతాడని అంటున్నారు.