విజయాన్ని ప్రక్కన పెట్టి  వివాదాలను కౌగలించుకున్న ఒకప్పటి స్టార్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి రంగం సిద్దం చేస్తున్నారు.  రీసెంట్ గా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ విడుదలైన కొద్దీ నిముషాల్లోనే వైరల్ గా మారింది. ఆ ఉత్సాహంలో....  రాంగోపాల్ వర్మ మరొక వివాదానికి తెర లేపే పనిలో పడ్డారు.  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తరువాత చేయబోయే సినిమాను ప్రకటించారు ఆయన. ఆ చిత్రం టైటిల్ మెగా ఫ్యామిలీ.  తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ఈ చిత్రం వివరాలు వెల్లడిస్తానని నిన్న ప్రకటించారు.

అబద్దాల కోరు.. లీడర్ కాలేడు.. పవన్ పై పూనమ్ కామెంట్స్!

దాంతో మీడియా మొత్తం ఈ రోజు మెగా కుటుంబంపై తీయబోయే ఆ చిత్రం ఏమిటి, దాన్ని ఏ కోణంలో తీస్తారు..ఏ మెగా హీరోని టార్గెట్ చేయబోతున్నారనే ఆసక్తిగా ఎదురుచూసింది. అంతేకాదు మెగాభిమానులు సైతం ఆయన ట్వీట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూసారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయన ఓ ట్వీట్ చేసి ట్విస్ట్ ఇచ్చారు.

మెగా ఫ్యామిలీ చిత్రం 39 మంది పిల్లలను కలిగి ఉన్న ఓ వ్యక్తి కథ అని, కానీ నేను చిన్న పిల్లల సినిమాలు చేయలేను కాబట్టి నేను ఈ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యాను అన్నారు. దాంతో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే తుస్సమంది. చాలా సినిమాలు ఇఫ్పటికే వర్మ ప్రకటించి ఆపేసారు. అయితే ఈ మెగా ఫ్యామిలీ ని అక్కడ దాకా తీసుకెళ్లకుండానే ప్రారంభంలోనే ఆపేసారు. జనాలతో ఆడుకోవటంలో వర్మకు సరదా అని మరోసారి ప్రూవ్ అయ్యింది.