హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ తరచూ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచేది. తాజాగా మరోసారి పవన్ ని టార్గెట్ చేస్తూ పరోక్షంగా ట్వీట్ పెట్టింది. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసిన వాళ్లంతా కూడా అది పవన్ కళ్యాణ్ కోసం పెట్టిన పోస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఓ అబద్దాల కోరు రాజకీయనాయకుడు కాగలడు కానీ, లీడర్ మాత్రం కాలేడు. ఇది పూనమ్ పెట్టిన ట్వీట్. ఇక్కడ ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ జస్ట్ ఏ థాట్ (ఓ చిన్నఆలోచన) అని మాత్రమే పేర్కొంది.

పూజా హెగ్డే 'హౌజ్ ఫుల్' హ్యాపీ.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్!

కానీ ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ స్టేట్మెంట్ పెట్టిందో నెటిజన్లకు అర్ధమైంది. ఈ ట్వీట్ కింద నెటిజన్లు పవన్ ని రిలేట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో జనసైనికులు మరోసారి పూనమ్ పై మండిపడుతున్నారు. కావాలనే ఆమె పవన్ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతుందని పూనమ్ పై విరుచుకుపడుతున్నారు.

గతంలో కూడా పూనమ్.. పవన్ పై పలు ట్వీట్లు చేసింది. ముఖ్యంగా పవన్, పూనమ్ ని లింక్ చేస్తూ కత్తి మహేష్ చేసిన ఆరోపణలు అప్పట్లో పెను దుమారం రేపాయి. అదే సమయంలో పూనమ్ పెట్టిన కొన్ని ట్వీట్లు కూడా సంచలనమయ్యాయి. పవన్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూనే.. ఓ బడా దర్శకుడిపై పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది పూనమ్.

గత ఎన్నికల్లో పవన్ కి వ్యతిరేకంగా పూనమ్ రంగంలోకి దిగుతుందని అంతా అనుకున్నారు. కానీ పూనమ్ మాత్రం తెరవెనుక ఉండాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి  సినిమాల్లో అవకాశాలు పెద్దగా రావడం లేదు. అరకొర అవకాశాలతో నెట్టుకొస్తుంది.