వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఎదురవుతున్నా తాను అనుకున్న చిత్రాలని వర్మ తెరకెక్కిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. 

ఈ చిత్రంలో వర్మ వైఎస్ జగన్ పాత్రని పవర్ ఫుల్ గా చూపిస్తూ మిగిలిన రాజకీయ నాయకుల్ని కించపరిచేలా సన్నివేశాలు రూపొందించారు. ట్రైలర్స్, సాంగ్స్ లో కూడా ఇదే విషయం తేటతెల్లమవుతోంది. ఈ చిత్రంలో పాత్రలు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు మరికొందరు రాజకీయ నాయకులని పోలి ఉన్నాయి. 

ప్రస్తుతం ఈ చిత్రంపై హైకోర్టులో పిటీషన్ నమోదు కావడంతో విడుదల ఆలస్యం కానుంది. టైటిల్ కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్ర వివాదాలపై, వస్తున్న విమర్శలపై వర్మ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వైఎస్ జగన్ నుంచి ముడుపులు అందడం వల్లే వర్మ ఇలా కమ్మ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారనే ఆరోపణపై వెటకారంగా స్పందించాడు. 

మీనా, ఖుష్బూతో స్టార్ హీరో రొమాన్స్.. తప్పుకున్న జ్యోతిక, కీర్తి సురేష్?

ఈ ఐదేళ్లకు 50 కోట్లు అందాయి.. వారికి అవసరమైనప్పుడల్లా ఇలాంటి సినిమాలు చేస్తుంటా. అలాగే దావూద్ ఇంబ్రాహీమ్ నుంచి 50 కోట్లు.. మోడీ నుంచి కూడా 50 కోట్లు డబ్బు అందినట్లు వర్మ వెటకారంగా సమాధానం ఇచ్చాడు. 

బాబు, పవన్, లోకేష్ పాత్రలతో వర్మ ఐటెం సాంగ్.. శకుని కూడా షాకైపోతాడు

తానెప్పుడూ కమ్మవారిని కించపరచలేదని తెలిపాడు. భవిష్యత్తులో కూడా రాజీయా కథలతో సినిమా చేస్తానని అన్నాడు. జగన్ బయోపిక్ చేస్తారా అని ప్రశ్నించగా.. టిడిపి వాళ్ళు 50 కోట్లు ఇస్తే చేస్తానని అన్నాడు. కానీ జగన్ కు వ్యతిరేకంగా సినిమా చేయనని వర్మ తెలిపాడు. ఎందుకంటే జగన్ ని ట్రోలింగ్ చేసేలా ఎలాంటి సంఘటనలు జరగలేదు. కాబట్టి జగన్ కు నెగిటివ్ గా సినిమా చేయలేం అని వర్మ సమాధానం ఇవ్వడం విశేషం.