ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఈ ఫోటోలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన వర్మ.. 
బాలకృష్ణని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సెల్ఫీలో రోజా గారు హీరోలా కనిపిస్తున్నారని.. కానీ ఆమె పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా ఉన్నారని కామెంట్ చేశాడు.

మండలి గ్యాలరీలో బాలకృష్ణతో రోజా సెల్ఫీ: ఫ్రేమ్ లో చంద్రబాబు సైతం...

ఈ ఫ్రేమ్ లో అతడు రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నాడని.. బహుసా అతడు రోజాకి దిష్టి బొమ్మ కావచ్చు అంటూ బాలయ్యని ఉద్దేశిస్తూ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆ తరువాత అదే ఫోటోని షేర్ చేస్తూ.. 'అందమైన రోజా పక్కన కూర్చొని.. ఆ ఫోటోని నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా..?' అంటూ పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్ లపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు గతంలో వర్మ, బాలయ్య కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ వర్మపై మండిపడుతున్నారు. మరికొందరు ఈ మాటలు బాలయ్య ముందు అనేంత ధైర్యం మీకుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.