అమరావతి: 

శాసనమండలి గ్యాలరీలో సినీ హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా శాసన మండలి గ్యాలరీలో బుధవారం సందడి చేశారు. 

సభ వాయిదా పడిన సమయంలో చంద్రబాబు గ్యాలరిలోనే వేచి ఉన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు

యాదృచ్చికంగా ఒకే గ్యాలరీలో  ఉన్నారు. 

బాలకృష్ణతో రోజా సెల్ఫీ దిగి సందడి చేశారు. రోజా సెల్ఫీ తీసుకున్నప్పుడు ఫ్రేమ్ లోకి  బాలకృష్ణ మాత్రమే కాకుండా చంద్రబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు. శాసన మండలిలో పాలనా వీకేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఎ రద్దు బిల్లు చర్చకు వచ్చిన నేపథ్యంలో వారంతా గ్యాలరీలో కూర్చున్నారు.

బిల్లుల పరిస్థితి ఏమవుతుందనే ఉత్సుకత కొద్దీ అందరూ శాసన మండలి గ్యాలరీలో కూర్చున్నారు. బిల్లుపై వాడివేడి చర్చలతో పాటు వాగ్వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మండలి పలుమార్లు వాయిదా పడింది.

ఆ బిల్లులు శాసనసభలో ఆమోదం పొందాయి. అయితే, శాసన మండలిలో వైసీపికి సరిపోను సంఖ్యా బలం లేదు. టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. దీంతో బిల్లులను అడ్డుకోవడానికి టీడీపీ అన్ని విధాలా ప్రయత్నించింది. చివరకు టీడీపీ తన పంతాన్ని నెగ్గించుకుంది. 

బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని శాసన మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బిల్లు చట్టంగా రూపొందడానికి మూడు నెలల జాప్యం జరిగే అవకాశం ఉది.